మార్కాపురం: రాయవరం గ్రామ సమీపంలో ఆగి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
మార్కాపురం మండలం రాయవరం సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఎస్ ఎల్ వి టి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనకవైపు నుంచి ఓ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన సమయంలో బస్సు ఒకవైపు నిలిపి టైర్లు మార్చుకుంటున్నట్లుగా స్థానికులు తెలిపారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు