రాయదుర్గం: పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలంటూ పట్టణంలో వైఎస్సార్సీపీ ర్యాలీ, ధర్నా
పెంచిన పెట్రోలు డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని YSRCP డిమాండ్ చేసింది. ఆ పార్టీ SEC సభ్యులు గౌని ఉపేంద్రారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ రెడ్డి ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి లక్ష్మీబజార్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. వినతిపత్రాన్ని తహసీల్దార్ కు అందజేశారు. ధరలు పెంచబోమని చెప్పి ఇప్పుడు భారాలు మోపుతున్నారని మండిపడ్డారు.