రాయదుర్గం: పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన యువకుడు
రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న ఓ మహిళను డీకొనింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న శశి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మహిళ స్వల్పంగా గాయపడింది. గాయపడిన యువకుడిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. బళ్లారి రోడ్డులో ట్రాఫిక్ రద్దీ వల్ల ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.