కొండపి: వైసిపి పై విరుచుకుపడ్డ మంత్రి, విజయసాయిరెడ్డి ఒక డర్టీ పొలిటిషన్: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
విజయసాయిరెడ్డి ఓ డర్టీ పొలిటిషన్ అని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి తీవ్రంగా విమర్శించారు. ప్రకాశం జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడిన మంత్రి స్వామి వైసీపీ తామే 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామని విర్రవీగారనీ అన్నారు. మద్యం కుంభకోణం పై న్యాయ విచారణ జరుగుతుందని ఇందులో ఎవరు ఉన్న విడిచి పెట్టేది లేదన్నారు. విజయసాయిరెడ్డి కుంభకోణాలు చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చారని అన్నారు.