రాయదుర్గం: గుండ్లపల్లి బ్రిడ్జి వద్ద ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, తృటిలో తప్పిన పెను ప్రమాదం
రాయదుర్గం మండలంలోని వేపరాళ్ల - గుండ్లపల్లి బ్రిడ్జి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. శుక్రవారం మద్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బళ్లారి వైపు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఇసుక ట్రాక్టర్ రివర్స్ తీసుకునే క్రమంలో బస్సు ముందు భాగాన్ని డీకొన్నట్లు స్థానికులు తెలిపారు. బస్సు ముందు భాగం డ్యామేజ్ కావడంతో పాటు అద్దాలు పగిలాయి. బస్సులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.