యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు లో అన్యాయం జరిగిందని నిర్వాసితుడు రంగయ్య ఆవేదన
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామానికి చెందిన రంగయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరులో అన్యాయం జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వీకుల నుండి గుర్తింపుగా తమ దగ్గర ఉన్న పత్రాలను చూయించారు. మరి అధికారులు ఎందుకు మమ్మల్ని గుర్తించడం లేదో అర్థం కావడం లేదు అన్నారు. ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగామని మాకు న్యాయం జరగలేదు అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు