మార్కాపురం: మాజీ రెడ్డిపాలెం సమీపంలో మోటార్ బైక్ కారు ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి
మార్కాపురం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం బట్టు వారి పాలెం మధ్యలో మోటార్ బైకు కారును ఢీకొన్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో బైక్ పై వెళ్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని పొదిలి ప్రభుత్వ ఆస్పటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జు నుజ్జు అయిపోయింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.