తాడిపత్రి: తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. గత రెండు రోజుల క్రితం సదరు వ్యక్తి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని ఆసుపత్రిలోని మార్చురీ గదిలో భద్రపరిచారు. ఈ సంఘటనపై తాడిపత్రి అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.