కొండపి: సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి నేరాలను నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించిన సిఐ శ్రీహరి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ సర్కిల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సిఐ శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. నేరాల నియంత్రణకు ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలను సీఐ వివరించి చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ దొంగతనాలు అరికట్టే అంశంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన ప్రాంతాలలో దొంగతనాలు తిరగకుండా ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలానే యువత మత్తు పదార్థాలు గంజాయి వంటి అంశాలకు దూరంగా ఉండాలని తెలిపారు.