రాయదుర్గం: టి. వీరాపురం గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యం
రాయదుర్గం మండలం టి.వీరాపురం చెందిన ఇద్దరు బాలికలు ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. అదే గ్రామంలో 6వ తరగతి చదువుతున్న మంజిత, 4వ తరగతి చదువుతున్న సౌమ్య ఇద్దరూ సాయంత్రం ఆడుకునేందుకు బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిస్తే 9440796825 సమాచారం ఇవ్వాలని కోరారు.