గిద్దలూరు: కొమరోలు మండలంలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పై నుండి కిందపడి మహిళ మృతి, బోరున విలపించిన కుటుంబ సభ్యులు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ద్విచక్ర వాహనంపై నుండి క్రిందపడి లక్ష్మీదేవి అనే మహిళ గురువారం మృతి చెందింది. గోనపల్లి గ్రామ సమీపంలో ఉన్న పొలం వద్దకు తన కుటుంబ సభ్యులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లిన లక్ష్మీదేవి తిరిగి వస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనంపై నుండి క్రింద పడింది. తలకు బలమైన గాయం కావడంతో ఆమెను కొమరోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.