కనిగిరి: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మీడియా సమావేశం, ప్రధానోపాధ్యాయుడు బ్లాక్మెయిలింగ్ ఆడియో బయటపెట్టిన ఎమ్మెల్యే
కనిగిరి మండలం తాళ్లూరు ఎంపీపీ పాఠశాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు దద్దనాల శ్రీనివాస్ బ్లాక్ మెయిల్ అని కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆరోపించారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ బ్లాక్మెయిలింగ్ ఆడియో క్లిప్పింగ్ బయటపెట్టారు. గతంలో ఈ ఉపాధ్యాయుడు చాలా నేరాలు చేశాడని తన వద్ద సాక్షాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఒక ఆడ కూతురు భవిష్యత్తు పాడు చేయకూడదని ఓపిక పట్టుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ఉగ్ర నరసింహారెడ్డి ఆగ్రహ వ్యక్తం చేశారు. తనకు కాకపోయినా తన పదవికి అయినా గౌరవం ఇవ్వాలి కదా అన్నారు.