గిద్దలూరు: గిద్దలూరు ABM పాలెంలో భార్యను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు ఏబీఏం పాలెం లో గురువారం భార్య ప్రేమ కుమారిని గంగరాజు అనుమానంతో రోకలబండతో మోది హత్య చేశారు. హత్య ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి సంఘటనలు తమ ప్రాంతంలో జరగలేదని భార్యను హత్య చేసిన నిందితుడిని పోలీసులు కఠినంగా శిక్షించాలని స్థానికులు మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న ఓ వృద్ధురాలు మీడియాతో మాట్లాడుతూ, హత్య చేసిన నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.