మార్కాపురం: సిపిఐ జిల్లా సమితి కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జాతీయ కార్యదర్శి రామకృష్ణ
మార్కాపురం జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి కార్యాలయం ( పూల సుబ్బయ్య శాంతిభవన్ ) నూతన భవన నిర్మాణానికి సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విలువైన రాజకీయాలు చేశారు ప్రజల కోసం జైలుకు వెళ్లారు ప్రాణాలను పణంగా పెట్టాడు కాబట్టి కామ్రేడ్ పూల సుబ్బయ్య ను ఈనాటికి కూడా స్మరించుకుంటున్నామన్నారు. ప్రజా నాయకులు ప్రజా ఉద్యమాల ద్వారా జనం నుండే పుట్టుక రావాలన్నారు. ఆ విధంగా అందరూ ఆలోచించాలన్నారు. ఆయన కృషి ఫలితంగా ఏర్పాటుచేసిన పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.