గిద్దలూరు: బేస్తవారిపే సమీపంలోని ఒంగోలు కర్నూలు హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట పట్టణ సమీపంలోని ఒంగోలు రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని పాపాయిపల్లి గ్రామానికి చెందిన సుబ్బమ్మ అనే వృద్ధురాలు సంఘటన స్థలంలోనే మృతి చెందింది. రోడ్డుపై నడిచి వెళుతున్న క్రమంలో వృద్ధురాలిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లుగా పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.