గిద్దలూరు: బేస్తవారిపేట మండలం చింతలపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు కి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం చింతలపల్లి క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు 108 అంబులెన్స్ లో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు బేస్తవారిపేట మండలం మోక్షగుండం గ్రామానికి చెందిన గురువారెడ్డిగా పోలీసులు గుర్తించారు. గురువారెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయని ఒక కాలు విరిగినట్లుగా వైద్యులు తెలిపారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.