దర్శి: ముండ్లమూరు మండలంలో ఎల్ నినో ప్రభావం వల్ల ఎండిపోతున్న జామాయిల్ తోటలు
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ళలో ఎల్ నినో ప్రభావంతో జామాయిల్ తోటలపై తీవ్రంగా ప్రభావం పడింది. వర్షాలు కురవక భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్ల ద్వారా నీటి తడులు అందించడం కష్టంగా మారింది. దీంతో కొన్ని జామాయిల్ చెట్లు ఏంటి పోగా మరికొన్ని చెట్లు ఎండు ముఖం పట్టాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తోటల సాగుకు తీవ్ర నష్టం వాటిలో ప్రమాదం ఉందని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.