గిద్దలూరు: గిద్దలూరులోని ఈనెల 27, 28వ తేదీలలో వర్చువల్ మహానాడు కార్యక్రమం, ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వర్షన్ హాల్లో ఈ నెల 27, 28వ తేదీలలో జరిగే వర్చువల్ మహానాడు కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించారు. ఆన్లైన్ విధానంలో మహానాడు కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే ఎమ్మెల్యే తెలిపారు. ఇంధనం పొదుపు చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు నెల్లూరులో జరగవలసిన మహానాడు కార్యక్రమం రద్దు అయినదని ఈ నేపథ్యంలో వర్చువల్ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.