గిద్దలూరు: గిద్దలూరులో జూన్ 3వ తేదీన రైతు సంఘాల సమైక్య సమావేశం, విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ప్రవీణ్ కుమార్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వెన్షన్ హాల్ లో ఈనెల జూన్ 3వ తేదీన రైతు సంఘాల సమైక్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని సంబంధిత సంస్థ చైర్మన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు. గతంలో పిడతల రాంభూపాల్ రెడ్డి స్థాపించి ఈ సంస్థను ముందుకు తీసుకు వెళ్లేందుకు రైతులతో కలిసి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు గిట్టుబాటు ధరలు వంటి అంశాలపై మాట్లాడడం జరుగుతుందని నియోజకవర్గంలోని రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.