రాయదుర్గం: పట్టణంలో స్వచ్చత కార్యక్రమాలు, శ్రమదానం చేసిన ఎమ్మెల్యే
ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంద్ర లో బాగంగా శనివారం పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. పారిశుద్ధ్య సిబ్బంది, ఉద్యోగుల చేత ఎమ్మెల్యే స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రతీరోజూ కొంత సమయం కేటాయించి పరిశుభ్ర ఆంద్రప్రదేశ్ కోసం కృషి చేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.