గిద్దలూరు: కంభంకు చెందిన వివాహిత అనితను హత్య చేసిన భర్త సత్యం కు జీవిత ఖైదు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మార్కాపురం కోర్టు
మార్కాపురం జిల్లా కంభం కు చెందిన వివాహిత అనితను ఆమె భర్త సత్యం అనుమానంతో 2018 వ సంవత్సరంలో గొంతుకు తాడు బిగించి హత్య చేశాడు. అప్పటి సీఐ భీమానాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో పూర్తి సాక్షాదారాలు ప్రవేశపెట్టగా కోర్టు విచారించి నిందితుడికి సోమవారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. భార్యను హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు జైలు శిక్ష విధించడమే కాకుండా వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పించింది. నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించారు.