లింగాల ఘనపూర్: లింగాల ఘనపూర్ లో మహిళ పుస్తెలతాడు దొంగతనానికి ప్రయత్నం: ఇద్దరు అరెస్ట్
లింగాల ఘనపూర్ నెల్లుట్ల శివారులో పత్తి చేనులో మహిళపై దాడి చేసి పుస్తెలతాడును లాగేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్యపురికి చెందిన ఉపేందర్, విష్ణు అనే నిందితులు పల్సర్ బైక్ పై వచ్చి ఈ నేరానికి పాల్పడ్డారు.