గిద్దలూరు: కొమరోలు మండలం సూరివారిపల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో ఒకరోజు ఒక గ్రామం కార్యక్రమం
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం సూరవారి పల్లి గ్రామంలో ఒకరోజు ఒక గ్రామం కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ వారి ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై అర్జిల స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యల లేని గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక రైతులు వారి సమస్యలపై జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు.