యర్రగొండపాలెం: వైపాలెం నీటిపారుదల శాఖ కార్యాలయం ముందు బంకు తొలగించకుండా సిబ్బందిపై దురుసు ప్రవర్తన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యాలయం గేటు ముందు స్థానికంగా ఉండేవారు బంకు ఏర్పాటు చేసుకొని అడ్డంగా పెట్టారు. బంకును తొలగించాలని సంబంధిత కార్యాలయ సిబ్బంది సూచించినప్పటికీ తొలగించడం లేదని అధికారులు తెలిపారు. బంకు ఏర్పాటు చేసుకున్న వారు వారి బంధువులు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.