రాయదుర్గం: మారెంపల్లి వద్ద ఆటోను డీకొన్న మాధవి ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఒకరు స్పాట్ డెడ్
రాయదుర్గం-అనంతపురం జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయదుర్గం నుంచి హైదరాబాద్ వెళ్తున్న మాధవి ప్రైవేట్ ఏసీ ట్రావెల్స్ బస్సు, ప్యాసింజర్ ఆటోను ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. రాత్రి 8.30 గంటల సమయంలో మారెంపల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను బస్సు వేగంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు హుళికల్లు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.