రాయదుర్గం: తప్పిపోయిన బాలున్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన కణేకల్లు పోలీసులు
*తప్పిపోయిన దివ్యాంగ బాలున్ని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన పోలీసులు* దేశభక్తి, మే 23, రాయదుర్గం : తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన దివ్యాంగుడైన ఓ బాలున్ని గంటల వ్యవధిలోనే తల్లిదండ్రుల వద్దకు చేర్చి కణేకల్లు పోలీసులు మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే మండలంలోని నాగేపల్లి గ్రామానికి చెందిన ఎర్రిస్వామి కుమారుడు గౌతమ్ మాటలు రాని మూగవాడు. శనివారం సాయంత్రం ఇంటి వద్ద నుంచి సరదాగా నడుచుకుంటూ మాల్యం గ్రామ సమీపంలోని వేదవతి-హగరి నది వద్దకు వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తుండగా గొర్రెల కాపర్లు చేరదీసి పోలీసులకు సమాచారం అందించారు.