గిద్దలూరు: పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకుంటామని అధికారులు ప్రజాప్రతినిధుల చేత ప్రతిజ్ఞ చేయించిన గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రజా ప్రతినిధులు అధికారులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. శనివారం గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. తడిచేత పొడి చెత్తను వేరువేరుగా చేసి పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలు అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. తర్వాత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అధికారులు ప్రజాప్రతినిధుల చేత ప్రతిజ్ఞ చేయించారు.