కనిగిరి: చంద్రశేఖరపురం మండలం శీలం వారి పల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
చంద్రశేఖరపురం మండలం శీలం వారి పల్లి గ్రామంలో కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి లబ్ధిదారులను నేరుగా కలిసి వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు పెన్షన్లను భారీగా పెంచి లబ్ధిదారులకు అందజేస్తున్నారు అన్నారు. పెన్షన్లు పొందిన లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.