యర్రగొండపాలెం: జిల్లా కలెక్టర్ విజయ సునీతను కలిసిన ప్రముఖ రచయిత కవి అధ్యాపకులు గొట్టిముక్కల నాసరయ్య
మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో నూతన జిల్లా కలెక్టర్ విజయ సునీతను త్రిపురాంతకం కు చెందిన ప్రముఖ రచయిత కవి అధ్యాపకులు శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల నాసరయ్య కలిశారు. పశ్చిమ ప్రాంతంలో వెనుకబడిన జిల్లాను విద్యా వైద్యం పారిశ్రామిక రంగాలలో అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సందర్భంగా తను రాసిన నడిచే నీడలు పుస్తకాన్ని అందజేశారు.