యర్రగొండపాలెం: దోర్నాలలో మొదలైన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు : డిఎం లావణ్య
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలో నూతనంగా ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభించినట్లు మార్కాపురం డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. సుమారు కోటి రూపాయలు మందులు కాగా తొలి విడతగా 49 లక్షలతో మూడు ప్లాట్ఫారాలు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఇటీవల మంత్రి గొట్టిపాటి రవికుమార్ టిడిపి ఇన్చార్జి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.