గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద కారు ద్విచక్ర వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడుకి తీవ్ర గాయాలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ద్విచక్ర వాహనం ఢీకొని మండలంలోని పెంచికపాడు గ్రామానికి చెందిన వీరయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.