మార్కాపురం: జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ గౌతమ్ పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధికార పూర్వకంగా మొదటిసారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ ప్రాముఖ్యతను వివరించారు.