రాయదుర్గం: విద్యుత్ ప్రమాద బాదితుడికి మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి పరామర్శ
రాయదుర్గం పట్టణంలోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన ప్రభాకర్ విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 8 నెలలుగా మంచానికే పరిమితమయ్యాడు. ఉరవకొండ ప్రాంతంలో ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలపాలవడంతో నడవలేని దీనస్థితిలో ఉన్నారు. ఆయన భార్య కూలి పనులకు వెళితే తప్ప కుటుంబం గడవని పరిస్థితి. విషయం తెలుసుకున్న బిజెపి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బాధితుడి మంగళవారం సాయంత్రం నివాసానికి వెళ్లి పరామర్శించారు.