దర్శి: దర్శి శాఖ గ్రంధాలయాన్ని పరిశీలించిన ఎమ్మార్వో శ్రవణ్ కుమార్
Darsi, Prakasam | May 13, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండల కేంద్రంలోని పాత ఎమ్మార్వో కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మార్వో శ్రవణ్ కుమార్ పరిశీలించారు. పుస్తకాలను పరిశీలించి విద్యార్థులకు యువతకు పనికొచ్చే పుస్తకాలను ఏర్పాటు చేయాలని గ్రంథ పాలకురాలు విజయ కుమారి కి సూచించారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలని తెలిపారు. యువత గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని ఉద్యోగ అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు.