గిద్దలూరు: బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల క్రిష్టపురం వద్ద ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల క్రిష్టపురం గ్రామంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 అంబులెన్సులో కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ టైర్ పంచారు కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.