దర్శి: వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పట్టణంలో ముస్లిం మత పెద్దలు వెల్లడి
Darsi, Prakasam | Apr 24, 2025 దర్శి పట్టణంలోని మసీదు నందు ముస్లిం మత పెద్దలు గురువారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వక్ఫ్ సవరణ బిల్లుకు నిరసనగా బుధవారం చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు.అదేవిధంగా వక్ఫ్ బిల్లును సవరణ చేయడం ద్వారా ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుపై పునరాలోచించాలని వారు డిమాండ్ చేశారు.