యర్రగొండపాలెం: దోర్నాల మండల కేంద్రంలో వాటర్ ట్యాంక్ నిర్మాణంలో లోపాలు, ఆందోళన చెందుతున్న గ్రామస్తులు
మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలో జరుగుతున్న వాటర్ ట్యాంక్ సంపు నిర్మాణ పనులపై గ్రామస్తుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వాలిటీ ఆఫ్ వర్క్ పేరుతో పనులు చేపడుతున్న కనీస క్యూరింగ్ కూడా చేయకపోవడంతో నాణ్యత లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. పనుల ప్రాంతంలో కార్మికులు కూడా సరిగ్గా లేరని ఇలాంటి నాణ్యతలేని నిర్మాణాల వల్ల భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలు జరుగుతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.