దర్శి: గంగాదేవి పల్లి రైతు సేవా కేంద్రంలో ఎరువుల వాడకం పై అవగాహన కల్పించిన ఏవో బాలకృష్ణ నాయక్
Darsi, Prakasam | Jun 16, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం గంగాదేవి పల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలని ఏవో బాలకృష్ణ నాయక్ రైతులకు అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా రైతుల కోసం రూపొందించిన ఆన్లైన్ యాప్ ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. భూమి పరీక్షలను బట్టి పంటలకు మోతాదుకు మించకుండా ఎరువులను వినియోగించుకోవాలని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పంటలను రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.