రాయదుర్గం: పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రాయదుర్గం పట్టణంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలు కొనియాడారు. తాను పడిన కష్టాలను బడుగు బలహీన వర్గాలవారు పడకూడదనే ఉద్దేశ్యంతో కష్టపడి చదివి రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. సమాన హక్కులు కల్పించిన మహనీయుని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆయన ఆశయ సాధనలో ముందుకు సాగుతామని తెలిపారు.