గిద్దలూరు: గిద్దలూరు మండలంలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి 4 నెలలు జైలు శిక్ష విధించిన గిద్దలూరు కోర్టు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి న్యాయమూర్తి భరత్ చంద్ర సోమవారం 4 నెలలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. 2026 మే నెలలో 2 వాటర్ మోటర్లను ఒక కూలింగ్ బాక్సుని దొంగిలించిన మహమ్మద్ అల్తాఫ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి సాక్షాదారాలతో కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.