గిద్దలూరు: కొమరోలు మండలం తాటిచెర్ల మోటు సమీపంలోని జాతీయ రహదారిపై విస్తృత వాహన తనిఖీలు చేపట్టిన ఎస్ఐ నాగరాజు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఆదివారం స్థానిక ఎస్సై నాగరాజు వాహన తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల తరలింపు వంటివి అరికట్టడంతో పాటు అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు ఈ వాహనాల తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. అలానే మితిమీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని వాహనదారులకు ఎస్ఐ సూచించారు.