గిద్దలూరు: కొమరోలు మండలంలోని ఇస్లాం పేటకు చెందిన నాగూర్ వలి అదృశ్యం, కనిపిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం ఇస్లాంపేటకు చెందిన వృద్ధుడు నాగూర్ వలి మతిస్థిమితం కోల్పోయి అదృశ్యమయ్యారు. ఈనెల 18వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన నాగూర్ వలి తిరిగి ఇంటికి రాలేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎవరన్నా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే 9704617515 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని నాగూర్ వలి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.