యర్రగొండపాలెం: త్రిపురాంతకం సీఐ ఎస్ఐ కార్యాలయాలను తనిఖీ చేసిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం సర్కిల్ కార్యాలయము పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసుల వివరాలు ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీశారు. పలు రికార్డులను పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధన నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. మహిళలు చిన్నారులు వృద్ధులపై జరిగే నేరాలు నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.