గిద్దలూరు: గిద్దలూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ప్రజా సంఘాలు, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుపై పట్టు
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గిద్దలూరులో రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది. ప్రజాసంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. గిద్దలూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు, డిగ్రీ కళాశాల, ప్రొఫెషనల్ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తీర్మానించారు. విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలో సదుపాయం లేక సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అతి త్వరలో అందరూ సమావేశమై కలిసికట్టుగా కళాశాలలో సాధిద్దామని ప్రజాసంఘాల నాయకులు తీర్మానించారు.