యర్రగొండపాలెం: కలనూతల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేసిన టిడిపి ఇన్చార్జి ఎరీక్షన్ బాబు
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛనుదారులకు ఇబ్బంది లేకుండా ప్రతి నెల ఒకటో తేదీన స్వయంగా వారి ఇంటికి వెళ్లి అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అన్నారు.