రాయదుర్గం: గొల్లపల్లి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి వివరాలు లభ్యం
గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ శివారులోని కొండ వద్ద గురువారం అనుమానాస్పద స్థితిలో లభించిన మృతదేహం వివరాలు తెలిశాయి. మృతుడు కర్నాటకలోని మొలకాల్మూరు పోలీసు స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన మాణిక్ హల్దర్ (63) గా పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు క్రైం నంబర్ 135/2026 తో మొలకల్మూరు పోలీసు స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. అతను గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఈ నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయి మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని సిఐ వెంకటరమణ ఒక ప్రకటన తెలియజేశారు.