తాడిపత్రి: తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వజ్ర ప్రహార్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు
తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం తిరిగి సాయంత్రం రెండు దఫాలుగా సీఐ శివ గంగాధర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు వజ్ర ప్రహార్ ఆపరేషన్ను నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానితులు, పాత నేరస్తుల ఇళ్లను సోదాలు చేశారు. డ్రగ్స్, మత్తు పదార్థాలు పై ఆరా తీశారు. వాహనాలు తనిఖీ చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.