కళ్యాణదుర్గం: ఉండవల్లిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ తో కళ్యాణదుర్గం కు చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతి చౌదరి భేటీ
ఉండవల్లిలో శుక్రవారం కళ్యాణదుర్గం కు చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారుతి చౌదరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితుల గురించి కాసేపు చర్చించారు. పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని మారుతి చౌదరికి లోకేష్ సూచించారు. పార్టీ, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించినట్లు మారుతి చౌదరి చెప్పారు.