రాయదుర్గం: కాంగ్రెస్. బిజెపి, వైసీపీ కుమ్మక్కు : రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆరోపణ
కాంగ్రెస్,వైసీపీ,బీజేపీ ముసుగు వేసుకున్న నాయకులు మూకుమ్మడిగా టీడీపీ పార్టీని దెబ్బతిసేప్రయత్నం చేస్తున్నారని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు ఆరోపించారు. శుక్రవారం రాయదుర్గం టిడిపి కార్యాలయంలో పార్టీ నాయకును ఉద్దేశించి మాట్లాడారు. ఐదేళ్లు అక్రమాలకు పాల్పడి..ఇప్పుడు వేరే పార్టీల ముసుగు వేసుకున్న వారితోనే తనకు సమస్య అని స్పష్టం చేశారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు.