రాయదుర్గం: పట్టణంలో చెత్త తరలింపు ట్రాక్టర్ పై నుంచి పడి తీవ్రంగా గాయపడిన పారిశుద్ధ్య కాంట్రాక్టు కార్మికుడు
రాయదుర్గం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుడు ఉల్లిగన్న మంగళవారం ప్రమాదానికి గురయ్యాడు. అంబేడ్కర్ నగర్‌కు చెందిన ఇతను 10వ వార్డులో చెత్తను ట్రాక్టర్‌లో వేస్తుండగా కాలుజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి కార్మికులు వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బళ్లారి విమ్స్‌కు తరలించారు. శ్యానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర యాదవ్ ఆసుపత్రిలో పరామర్శించారు.